Thursday, 14 May 2020
ఎటూచేరని కథ...
అతన్ని మొదటిసారి మా ఇంట్లోనే చూసాను. నూనూగు మీసాలు, కళ్ళు గుండ్రంగా గాజుకళ్ళు, నవ్వు, ముక్కు ముఖానికి ఏదో ప్రత్యేకతను తెచ్చిపెట్టినట్టు ఉంటాయి. నేను ఎందుకో ఆరోజు ఇంట్లోవాళ్ళ మీద అలిగి పడుకున్నాను. చాలాసేపటికి మొలకువ వచ్చింది. పెరట్లో నాన్నగారి గొంతు ఖంగుమని వినిపిస్తుంది. లేవటమే నా గదిలోంచి పెరటివైపుకు వెళ్ళాను. సాయంత్రం ఆరు కావొస్తుంది. ఇంకా వెలుతురు పోలేదు. మేడమీది జాజిపూలు విచ్చుకుంటూ గుప్పున సువాసన ఆ చుట్టూ అల్లుకుంది. పెరట్లో నాన్నగారు వాటర్ ట్యాంక్ కట్టిస్తున్నారు. నేను ఏం జరుగుతుందోనని నాలుగు అడుగులు వేసేప్పటికి- ఓ ఇద్దరు వాటర్ ట్యాంక్ కడుతున్నారు. ఇద్దరితో కూడా వచ్చిన ఒకడు ముందు వైపు నించుని దిక్కులుచూస్తున్న వాడల్లా నన్ను చాలా ఆసక్తిగా చూసాడు. నేనూ పక్కన నాన్నగారు ఉన్న సంగతి మరిచిపోయి మరీ అతన్ని గమనించాను. ఎత్తుగా, చాలా బలంగా, తెల్లగా ఉన్నాడు. వయసు ఓ పాతికేళ్ళు ఉంటుంది. రూపం గురించి టక్కున చెప్పాలంటే ఆంగ్లో ఇండియన్ లా ఉంటాడు. ఈ పనివాళ్ళ కాట్రాక్టరట. పక్కనున్న నాన్నగారు గమనించకుండానే నావంక చూస్తూ రహస్యమైన నవ్వు నవ్వి మళ్ళీ పనిలో పడిపోయాడు. అది మొదలు మా ఇంట్లో పని పూర్తయ్యేవరకూ అతను వచ్చినన్ని సార్లు అతన్ని నేనూ, నన్ను అతనూ గమనిస్తూ ఉండేవాళ్ళం. ఇద్దరం ఒకరిని ఒకరం గమనించుకునేవాళ్ళం. ఇద్దరికీ ఆ తరవాత ఏం చేయాలో తెలీదు. ఏమో అతనికి స్నేహితుల సాయం ఉందేమో, నాకు అదీ లేదు. కానీ తన కూడా ఉన్న చిన్న కుర్రాడు ప్రతిరోజూ మా ఇంటికి పాలకి వచ్చేవాడు. వాడే కొన్ని కబుర్లు మోసుకువచ్చేవాడు అతని గురించి. నేను మరీ ఆసక్తిగా కాకపోయినా మొత్తానికి తన గురించి అడిగేదాన్ని. అతనికి నేనంటే చాలా ఇష్టమని ఓసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఆ కుర్రాడు చెప్పాడు. నేను మేడమీద పూలు కోయడానికి వెళ్ళినప్పుడు పక్క రోడ్డులోకి వచ్చి సైకిల్ మీదనే కూర్చుని నన్నే గమనించేవాడు. అలా ఎంతసేపైనా సరే.. నన్నే చూస్తూ ఉండిపోయేవాడు.
Subscribe to:
Post Comments (Atom)
నీలోకి ఒలికిపోయాననీ..
ఈరోజుకి రాసే ప్రేమలేఖ ఇది.. కొన్నిసార్లు అనిపిస్తుంది. నేను నీలోకి ఒలికిపోయాననీ.. నీలోకి వచ్చి చేరాకా హృదయంలోని నిశ్శబ్దానికి...
-
హిమజ్వాల నవల వడ్డెర చండీదాస్ రచించారు. కథ ప్రారంభంలో గజి బిజిగా అనిపించింది. నెమ్మదిగా పాత్రల స్వభావాలను అర్థం చేసుకుంటూ కథలోని ఉద్దేశాన్...
-
“చీకటి”... ఇది ఇంత అందంగా ఉంటుందని నాకు తెలీదు. నా మనసుకు హత్తుకున్న ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది ఈ కథ. నేను ఈ మధ్య చదివిన కథల్లో వర్ణ...
-
సత్యం శంకరమంచి "అమరావతి కథలు" పై నా సమీక్ష కినిగె పత్రికలో . “అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనుక సూర...
No comments:
Post a Comment