పోస్ట్‌లు

2016లోని పోస్ట్‌లను చూపుతోంది

మా సుబ్బయ్యగారింట్లో దొంగలు పడ్డారు.

చిత్రం
ఓ పక్కగా తెల్లారిందో లేదో ఈ వార్త వినగానే ఉలిక్కిపడ్డారు పెద్దోళ్ళంతా.  పొద్దున్నే ఊడ్చి , కళ్ళాపి జల్లి , పొయ్యిలెలిగించే ఆడాళ్ళయితే , జుట్టుముడి ఊడిపోయినా పట్టించుకోకుండా ఓ గుంపుగా చేరిపోయి ఆ గొడవే మాట్లాడేసుకుంటున్నారు. “ అయ్యో పాపం ఇరవైతులాల బంగారం , నలభై వేలరూపాయల సొమ్మూ ఎత్తుకుపోయారంట. ఇంకా ఏం ఎత్తుకుపోయారోనమ్మా సచ్చినోళ్ళు ” “ సుబ్బయ్యగారు బాగానే సంపాదించాడులే , పార్వతమ్మ ఓ వెలుగు వెలిగింది. అంతా పోయే ఉంటాది. ” “ పోతేపోయింది రేపట్నుండి మనల్ని అప్పులడగకుండా ఉంటే నయ్యం ” అంటూ మూతులు తిప్పుకుంటా , మనకెందుకొచ్చిన గొడవలే అంటా సాగదీసుకుంటున్నారు.  ఇక మగాళ్ళయితే పంచలెగ్గట్టి ఒకరి తరువాత ఒకరు రచ్చబండ మీద మీటింగులెట్టేసారు. “ పాపం సుబ్బయ్యగారు ఎంత దజ్జాగా ఉండేవోడు. యాభై తులాల బంగారం , లక్షరూపాల సొమ్మూ ఎత్తుకుపోయారంట. ఇకపోయిన సొమ్ముతోనే ఆయన దజ్జాకూడా పోయినట్టేరా ఎంత కష్టం వచ్చింది ఆ కుటుంబానికి ” అనుకుంటూ తెచ్చిపెట్టుకున్న బాధతో తెగ జాలిపడిపోతున్నారు. తెల్లారినంతనే ఏదో ఉపద్రవం వచ్చిపడిపోయి ఆరోజు బడి ఎగ్గొట్టేయాలని రాత్రే దేవుడికి తెగ దండాలెట్టేసి పడుకున్...

అందుకే నేనటుగా వెళ్ళను.

చిత్రం
ఊహతెలిసాకా నా తొలి జ్ఞాపకం నాన్నగారి వేలు పట్టుకుని నడుస్తున్నాను. ఎక్కడికో తెలీదు. తెలతెలవారుతుంది. మంచాల పై నుండీ నిద్రను వదిలించుకోని జనం. పాచి ముఖాలతో వాకిళ్ళు ఊడుస్తున్న ఆడవాళ్ళు. పాల సైకిళ్ళు. నాన్నగారిని దారంటా అంతా పలకరిస్తున్నారు. ఆయన  చాలా వేగంగా నడుస్తుంటే ఆయన్ను అందుకోవాలనే నా ప్రయత్నం. *  *  * సాయంత్రం అవుతుంది, పెద్ద చెరువు, దాని గట్టు చుట్టూ ఎతైన కొబ్బరి చెట్లు, పిట్టల కూతలు, వాతావరణం చల్లగా ఉంది. సంతోషి మాత గుడిలో ప్రసాదం కోసం పార్కు బెంచీ మీద కూర్చుని గుడివైపే చూస్తున్నాం నేను, చెల్లి. గుడికి కాస్త దూరంలో పశుల ఆసుపత్రి. కటకాల గదికి పెద్ద తాళం కప్ప వేళాడుతూ ఉంటుంది ఎప్పుడూ. మేమొచ్చిన దగ్గరనుండీ ఓ రెండు మార్లు చూసుంటాను డాక్టర్నిఅంతే. ఈ ఆసుపత్రికి కాస్త దూరంలోనే ఉంటాం మేము. మొదటిసారి  ఈ వీధికి అద్దె ఇంటికోసం వచ్చినపుడు, "పెద్ద అరుగుల ఇంట్లో ఓ వాటా ఖాళీగా ఉందండి ఓసారి కనుక్కోండి" అన్నాడు పోస్టుమాస్టారు. అంతే నాన్నగారు నన్ను తీసుకుని ఇటుగా వచ్చారు. అదే నేను చేసిన పెద్ద తప్పని చాలాసార్లు ఫీలయ్యాను. లేదంటే ఎవరు రాకాసి పాపమ్మ ఇంట్లో అద...

“చైతన్య సాధనమైన రేడియోని సినిమా పాటలతో నింపేస్తున్నాం.” – శారదా శ్రీనివాసన్

చిత్రం
నిన్నటి తరం రేడియో అభిమానులను తన స్వరంతో అలరించి, శ్రవ్య నాటకాల ద్వారా సాహిత్యంలో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన శారదా శ్రీనివాసన్ గారితో ముఖాముఖి. - శ్రీశాంతి దుగ్గిరాల 1. మీ తల్లితండ్రులు, తోబుట్టువులు, బాల్యం, గురించి? మాది చాలా పెద్ద కుటుంబం. ఐదుగురు అన్నదమ్ములూ, నలుగురు అక్కచెల్లెళ్ళం. మా నాన్నగారు ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్ లో పనిచేసారు. మాలో అన్నదమ్ములంతా పెద్దవాళ్ళు. మగపిల్లలు త్వరగా చేతికందిరావాలని వారిని చదివించడంలో ఎక్కువ శ్రద్ధ చూపించారు. నేను కూడా బాగా చిన్నతనంలో స్కూలుకి వెళ్ళాను కానీ తర్వాత మా నాన్నగారు ఇంటి దగ్గరే చదువు చెప్పించారు. నాన్నగారికి బదిలీలు ఎక్కువగా అయ్యేవి. దానివల్ల మా చదువులు సరిగా సాగేవి కాదు. ఊరు మారినప్పుడల్లా కొత్త ఇంటి తో పాటు ఓ డాక్టర్ని, సంగీతం మాస్టారుని కూడా చూసేవారు నాన్నగారు. ఇక ఆడపిల్లల చదువుల విషయం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు ఆయన. కానీ మేము తణుకు వచ్చే సరికి, అప్పటికి నాకు పదీపదకొండేళ్ళు ఉంటాయి, మా అమ్మ గొడవ పెట్టి అక్కడి బాలసరస్వతి స్త్రీ సమాజం అనే పాఠశాలలో చేర్పించింది. నన్ను మా చిన్న చెల్లినీ పంపారు. అక్కడ నా చదువు మరో మూడేళ్ళు...

చలం గేలానికి...

చిత్రం
  నాలో చిన్నగా రాపిడి మొదలైంది. అది దేన్ని పుట్టిస్తుందో తెలీదు. ఈ రాపిడిలో నాకు తెలిసే విషయాలు చాలా ఉన్నాయని మాత్రం అర్థమవుతోంది. నన్ను ఒక్కసారిగా ఈ లోకం నుండీ బదిలీ చేస్తాయి ఆ ఆలోచనలు. ఎక్కడికి వెళ్తానో తెలియదు, తిరిగి రావడం తెలుస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది. ​నేను కొత్తగా పరిచయం చేసుకున్న రచయిత చలమే దీనికంతటికీ ​కారణమని తెలుస్తుంది నాకు. మొదట్లో రచయితగానే​ పరిచయం అయ్యాడు, క్రమంగా అతని రచనలు నాకేమిస్తున్నాయీ, అని ఆలోచించి​ తేల్చుకునేలోపే​ మెల్లగా సందుచేసుకుని నాలో దూరిపోయాడు. ఎవరతను, ఎందుకు పరిచయం అయ్యాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు. ఎప్పుడూ మామధ్య సాగేది ప్రశ్నల వర్షమే. ఏదో రమ్మన్నాడు కదాని​ ​కూడా వెళ్ళడం, అతను​ పుట్టించే​ ప్రశ్నలూ సందేహాలతో బిక్కమొహం వేసుకుని అంత అయోమయంతోనూ వెనుతిరగటం, ఆ సంభాషణలన్నీ నేను అనంతమైన అజ్ఞానంలో కూరుకుపోయున్నానని​ పదేపదే గుర్తుచేయడం... ఇదే సాగుతుంది కొంత కాలంగా. మొదట ​ సంభాషణ​ ప్రారంభిస్తాడిలా.. "అసలు ఎవరు నువ్వు, ఎందుకు జీవిస్తున్నావు? నేనూ, నాదీ అని కాకుండా నీలోని కోరికా, వ్యసనం, ఆనందం, చింతా అన్నీ వదిలి దీనికి మించి నీలో...