స్త్రీ లోకపు వెలుగు నీడలు : ఇస్మత్ చుగ్తాయ్ కథలు

పి. సత్యవతి గారి అనువాదంలో ఇస్మత్ చుగ్తాయ్ కథలు చదివాకా నా అభిప్రాయాన్ని కినిగె పత్రికలో క్లుప్తంగా చెప్పాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి. మీరూ చుగ్తాయ్ కథలు చదవండి. లింక్ ఇదిగో:-- స్త్రీ లోకపు వెలుగు నీడలు : ఇస్మత్ చుగ్తాయ్ కథలు ఒక రచయిత గురించి చెప్పాలంటే రచయిత వ్యక్తిగా ఎవరో తెలిస్తే కాస్త బాగా చెప్పగలుగుతాం. కానీ ఏమీ తెలియకపోయినా చుగ్తాయ్ కథలే ఆమె గురించి చాలా చెపుతాయి. ఆమె కథావస్తువులు, ఆలోచనలు అన్నీ ఆమె జీవితంలో నుండి పుట్టినవే. ఏ చిన్న విషయాన్నయినా ఆమె కథగా రాయగలరని ఈ పుస్తకం నిరూపిస్తుంది. బేగమ్ జాన్, కుబ్రాతల్లి, కుబ్రా, ఆమె చెల్లీ, రుక్సానా, హలీమా, గోరీబీ, సరలాబెన్, బిచ్చూ అత్తయ్య, వదినె, షబ్నమ్, ఇల్లూడ్చే ముసలమ్మ, ఫర్హత్… ఇలా పాత్రలన్నీ ఆమె పెరిగిన, ఎరిగిన వాతారరణంలో నుండి వచ్చినవే. చెప్పాలనుకున్నది సూటిగా, నిక్కచ్చిగా చెప్పడం చుగ్తాయ్ కథల ప్రత్యేకత. ఆమె ఈ కథలు రాసింది ఉర్దూలోనే అయినా తెలుగులోకి భావం ఏ మాత్రం చెడకుండా వచ్చింది. దీనికి అనువాదకురాలు పి. సత్యవతిగారి ని అభినందించాలి. అన్నీ స్త్రీ చుట్టూ తిరిగే కథలే ఐనా ఏ కథా మరో కథలా ఉన్నట్టు అనిపించ...