జీవం
నా సుగంధ పరిమళాలు
దిగంతాలు వ్యాపించడం తెలుసు
ఏటి ఒడ్డున నిలుచున్న నాకు నీటి గలగలలు తెలుసు
నా నీడన శయనించిన ప్రేమ జంటల కిలకిలలు తెలుసు
ప్రతి వెన్నెల రాత్రి నెలరాజు పలకరింపుగా నవ్వింది తెలుసు
పక్షులు నాపై వాలి పాడిన విరహగీతాలు తెలుసు
చిట్టి చేపలు నీట తేలి నా నీడతో సయ్యాటలాడటం తెలుసు
కానీ ఇప్పుడన్నీ
చాలా దూరంగా
పారిపోయాయి
ఎందుకనో
మరి నాలో
పూర్వపు
జీవం లేదనో
ఆకులు రాలి
పువ్వులు వడలి
మోడుగా మిగిలాననో
జీవం లేదనో
ఆకులు రాలి
పువ్వులు వడలి
మోడుగా మిగిలాననో

కవిత బాగుంది. చెట్టులా అమర్చిన వాక్యాల వరస బాగుంది. అభినందనలు.
రిప్లయితొలగించండికవిత నచ్చినందుకు దన్యవాదాలండి వర్మగారు.
రిప్లయితొలగించండిshantigaroo kavita chala baagundandi....
రిప్లయితొలగించండిభలే! చెట్టు మీద చెట్టులా అమరిన కవిత! చాలా నచ్చింది మీ ఐడియా నాకు, శ్రీశాంతిగారు!
రిప్లయితొలగించండి