పోస్ట్‌లు

మే, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

ఈ పాటతో గతానికి బదిలీ

చిత్రం
  జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై...   జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై...   జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... ఈ పాట నిన్నటి నుంచి తరుముతోంది. జీవితం వేసిన సంకెళ్ళను తెంచుకుని వచ్చేట్టు చేసిన పాటిది. జీవితమాధుర్యాన్ని పంచుకున్న పాట. అతని పిలుపు అతని ప్రేమ, విరహం అన్నీ కలగలిసి నన్ను నీవైపుకు లాగిన పాట. నీ పిలుపుకు మనసూరుకోక రాలేక పరుగెత్తుకొచ్చిన రోజులు. ఈపాటే నన్ను పడుచుదాన్ని చేసి, బ్రతుకుమీద ఆశ కల్పించింది. ఈ పాటే నిన్ను చేరుకునేంత దాకా నన్ను తరిమింది. గాలికి ఊగిన చెట్ల కొమ్మల చివరన నా కోరికలను కట్టి ఎగురుతూ వచ్చేట్టు చేసింది ఈపాటే. నీరుగా పారే గుణాన్ని, నిప్పులా కురిసే ఉత్తేజాన్ని నీతో బ్రతుకుని ఇచ్చిందంటే ఈపాట వేసిన వలపు వలే కారణం. పాట వస్తున్నంత సేపు మనసు పరవశించిపోయేది. పరవళ్ళు తొక్కేది. గతాన్ని ఉండలా చుట్టి నాముందు పెట్టే శక్తి ఒక్క ఈ పాటకు మాత్రమే ఉంది. మనసుకు తెరలు తొలగించే లోతు ఈపాట సొెంతం.  ఆకుల్ని రాలుస్తూ చెట్టు నవ్వుతోంది.  కరెంట్ తీగెలకు వేలాడుతున్నాయి చూపులు... వేళ్ళ చివర విషాదాన్...

వాన చినుకుల అక్షింతలు 22-5-23

చిత్రం
  ఇంకో పేజీ ఉందా? ఈ మగత తొలుగుతుందా? ఎగిరెగిరి రెక్కలార్చుకుని నీ ఒడిలో సేదదీరనిస్తుందా? ఒడ్డున వొరుసుకు ప్రవహించే నదిలా ఒంటరిగా వదిలేస్తుందా? ఏమో..(శ్రీ) ఎన్నో వసంతాలను దాచుకున్న జీవితమిది.. వాన చినుకుల అక్షింతల సెలయేరు.., ఎక్కడో కురిసిన వర్షం ఈ ఉదయాన్ని పులకింపజేసి... నన్ను స్పృహలోనికి తెచ్చిన కాంతి కోరికల ఇంద్రధనస్సు వైపు నడిపిస్తుంది. (శ్రీ)