Sunday, 12 December 2021

ఎవరు...



 వృథాగా రాలిపోయే కాలానికి తోటమాలి ఎవరు?

కాలపు గులాబీలను దోచుకెళ్ళే పసివాడు ఎవరు?

నీడలుగా జాడలుగా నన్ను అల్లుకున్న పరిమళం..

నీ చిగురు పాదాల ముందు ఉంచేందుకు పూలు కోసుకొద్దామంటే..

ఉషస్సు కోసం ఉర్రూతలూగి పూల గుబాళింపుకు కట్టుబడిన

తుమ్మెదలు సాక్ష్యమవుతాయేమో తెలియదు..

Saturday, 4 December 2021

కల....



పాతబడిన జ్ఞాపకాల
సంతలో పరచబడ్డ గురుతులెన్నో
కొన్ని రోజులు..కొన్ని క్షణాలు
అన్నీ జ్ఞాపకాలే..
మెరిసి మాయమయ్యే కలల
మధ్య మలినం లేని నీ ఊహ
ఊపిరై హత్తుకుంటుంది.
ఎన్నెన్ని పదునైన చూపులో
బిగించి పట్టుకున్న కౌగిళ్ళు..
ఎంగిలి ముద్దుల కవ్వింపులు
దీపాల వెలుగు జిలుగుల్లో
తడబడి సాగే నీ ఛాయను
దగ్గర చేసుకుంటూ...
మబ్బుల్ని కప్పుతూ
మూల్గుతూ శోక జీరను
కళ్ళకు వదిలి మాయమవుతుంది కల.
లోలోన రహస్యాల్ని తోడుతూ
రెక్కల్ని కొట్టుకుంటూ ఆకాశం వైపు
ఎగిరిపోతుంది.

Friday, 3 December 2021

వెలుగై వెంబడిస్తూ...




 ఎక్కడో దూరం నుంచి నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి

 వెలుగు రేఖలు..రాతిరి నా ఒంటరి కాలయాపనకు చిక్కి

 మిగిలిన శోక హృదయాన తృప్తిని నింపుతూ..తాకుతుంది నన్ను.

నీలి దీపాలను తాకుతూ..దేహమంతా వెన్నెల నింపుకుంది రాత్రి. 

వెలుగై వెంబడిస్తూ తరముకొచ్చింది ఉదయం.

పక్షులన్నీ ఏక కంఠంతో కిచకిచల గానం అందుకున్నాయి..

Wednesday, 1 December 2021

తేలుతూ కనిపించి...




 వెనక్కు వెళ్ళే కొద్దీ గత ప్రేమలు

పూల పడవల్లా జ్ఞాపకాల్లో
తేలుతూ కనిపించి
నవ్వుతాయి.
నా ఒడి నిండా మధుర
స్వప్నాలతో నిండిన రాత్రులు
నీ కౌగిలిలో గుభాళించిన
సంధ్యా పరిమళాలు
ఆ క్షణం నవ్వు నాకిచ్చిన
సంతోషాలు
చీకటి సాయంకాలాల్లో
ఇవన్నీ కొలుచుకున్నప్పుడు
చిక్కటి నిరాశ..
గాలిలో కలిసిపోయిన
కలలుగా కనిపిస్తాయి.
మరి ఇప్పుడు..
తెంపుకు వచ్చిన పూల
పుప్పొడి నేలరాలినట్టూ
ఉంటాయి నీ ఊహలు..
ఒకదాన్నొకటి తోసుకుంటూ
నేల రాలతాయి..
ఏముంది ఇప్పుడు మన మధ్య
ఖర్చయిపోయిన కాలపు
ఆనవాళ్లు తప్ప

కలలు..

ఎందుకు వస్తాయి కలలు ఆలోచనను పిండి కవితగా అల్లేందుకే గమ్యమంటూ లేని కలలు ఏ అతిథికీ అతిథ్యం ఇవ్వక రంగు రంగుల భావాలతో  గుసగుసలాడతాయి. జ్ఞాపకం కన...