పోస్ట్‌లు

2017లోని పోస్ట్‌లను చూపుతోంది

ఈమధ్య నేను చదివిన కథ.......

చిత్రం
బిడ్డను పోగొట్టుకోవడం అన్నది ఓ శాపం. చెట్టుకు వచ్చిన పిందెలన్నీ నిలవనట్టే పుట్టిన బిడ్డలందరూ నూరేళ్ళు ఉండాలని లేదు. కానీ కలనైనా తన బిడ్డలు దీర్ఘాయువుతో ఉండాలనే కోరుకుంటుంది ప్రతి తల్లీ. విధి మోసం చేసినప్పుడు. తన బిడ్డను ఎత్తుకుపోయినప్పుడు. ఆమెకు మిగిలేది మరో ప్రపంచమే. తను తప్ప ఎవరూలేని ప్రపంచం.  ఈ ప్రపంచాన్ని, ఈ బాధను నేను ఇంతకముందు ఎరిగి ఉన్నాను కనుక ఈకథ నన్ను చాలా సులువుగా తనలోనికి లాగేసుకోగలిగింది. “బదిలీ” ఇది కథకాదు. ఓ అమ్మ ఆక్రోశం. ఆమె పోగొట్టుకున్న బిడ్డకోసం పడే వేదన. ఆమెకు మాత్రమే సొంతమైన ప్రపంచానికి కాసేపు మనల్నీ తీసుకువెళ్ళి తన కథ చెప్పి, తిరిగి పంపేస్తుంది. ఆమెతో పాటుగా ఆ కథలోకి వెళ్ళినప్పుడు కన్నీరు ఎప్పుడు నాకళ్ళలో పుట్టి చెంపల మీదుగా జారిందో గమనించనేలేదు నేను. అలా వెళ్ళడం ఒక్కటే నా చేతుల్లో ఉంది. కథ చదవడం పూర్తి కాగానే నేను ఎంత బలంగా ప్రయత్నించినా అణువంతైనా ఈ కథ తప్ప మరోటి ఆలోచించలేని స్థితికి వచ్చేసాను. ఏదో బాధ. అందులోంచి కథలో ఉన్న సారాంశం అంతాపట్టుకుని ఆలోచించే శక్తిని కోల్పోయాను అనిపిస్తుంది. నన్ను పట్టి ఆపేసింది. ఆ తల్లీ బిడ్డలే. వారే ఉన్నారు నేను చదివిన,...

ఈమధ్య నేను చదివిన కథ..........

చిత్రం
చలం ఈ పేరు వెనక ఓ అగాథం, ఓ అంతుచిక్కని రహస్యం కనిపిస్తాయి ఎప్పుడూ. నిజానికి ఆయన నాకు ఎప్పటికీ అర్థం అయ్యీ అవ్వనట్టు ఉండిపోతాడు కామోసు. ఆయన రచనలు ఏది చదివినా కొన్ని రోజులపాటు వెంటాడి వేధిస్తాయి. ఈమధ్య నేను చదివిన “సుశీల” కూడా అలానే అనిపించింది. ఓ వందేళ్ళ తర్వాత కూడా మనిషి ఆలోచనా తీరుకు సరిపడా చలమే ఆలోచించేసి తన వాదనలని లేదా సందేశాల్ని ఇలా కథల రూపంలో మన మీదకి వదిలేసాడా అనే అనుమానమూ కలుగుతుంది నాకు. ఆడదానికి స్వేచ్ఛ లేదు అని తన ప్రతి కథలోనూ చెప్పుకొచ్చే చలం ఈ కథలో పూర్తి స్వేచ్ఛ ఉండీ ఆకర్షణలో పడే స్త్రీని కథావస్తువుగా ఎంచుకున్నాడు. ఈ కథకు సుశీల అని పేరు పెట్టినా నాకు ఆమె భర్త అయిన నారాయణప్పగారి గురించే కథ చెప్పాడు అనిపించింది. అతని చుట్టూ మాత్రమే సుశీల ఉంది అనిపించింది. ప్రేమకి, ఆకర్షణకి, వాత్సల్యానికి, బాధ్యతకి తేడాను చూపుతూ సాగుతుంది కథ. అతడు ఓ సంఘసంస్కర్త, భార్యను అప్పటి సమాజ కట్టబాట్లకు తగ్గట్టు వంటగదిలో కూర్చోబెట్టలేదు. ఆమెకు ఆస్తి, హోదా, తన స్నేహితులతో కలిసి తన వాదనలు వినిపించే స్వేచ్ఛను ఇచ్చాడు. ఆమె చేస్తున్నది తప్పని తెలిసినా ఎక్కడా సుశీలను కట్టడి చెయ్యాలనే ఉద్దేశ్యం లేన...

ఈమధ్య నేను చదివిన కథ.......

చిత్రం
“ఏ నిముషానికి ఏమి జరుగునో” ఈ కాలం, ఈక్షణం అపురూపమైనవి. నిన్న ఇదే కాలంలో, నిన్న ఇదే క్షణంలో నేను ఎక్కడున్నాను అన్న ప్రశ్న వేధిస్తుంది నన్ను అస్తమానూ.  ఆ క్షణంలో నేను ఉండే ప్రదేశాలు, కలిసే మనుషులు అన్నీ ఓ వింత అనుభూతిని మిగుల్చుతాయి. అలా ప్రతి మనిషీ ఓ అపరిచిత వాతావరణంలో గడిపే క్షణాలు రాకపోవు. అందులోని మనుషులు, పరిసరాలు అన్నీ నువ్వు ప్రస్తుతం నీదనుకుంటున్న ప్రపంచానికి కాస్త భిన్నమే, అయినా ఆ క్షణాలను ఆస్వాదించి, ఆ కొత్త ప్రపంచాన్ని ఆహ్వానించే మనసు నీకుండాలి. నువ్వు అనుకోని ఊహకందని వ్యక్తులను కలిసి వారితో గడిపినప్పుడు నీ ప్రపంచానికీ వారి ప్రపంచానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపుతాయి. అప్పుడు నీకెంత పలుకుబడి ఉన్నా, సమాజంలో ఎంత పేరున్నా, నిన్నో సామాన్యుడిగా, సాటిమనిషిగా మాత్రమే చూసే క్షణాలు గొప్పవి. అవి నిన్ను నువ్వు తెలుసుకునే క్షణాలు. “అతడు మనిషి” అద్దేపల్లి ప్రభు రాసిన ఈ కథ అదే చెపుతుంది. ఈయన రచనలు నేను ఇదే తొలిగా చదవడం. మామూలు శైలిలో చక్కగా సాగింది కథ. ఒక కోట్: “మనిషి సుఖంగా ఉన్నప్పుడు యాపారం చెయ్యచ్చు బాబూ..... కట్టంలో ఉన్నప్పుడు యాపారం చైకూడదు. రాత్రి మీరు కట్టంలో వచ్చ...

ఈమధ్య నేను చదివిన కథ..........

చిత్రం
నవమాసాలూ బిడ్డను తన కడుపులో మోసిన తల్లి బరువు దిగిందని కాస్తన్నా విరామం తీసుకోలేని స్థితి, ఆ ఆడబిడ్డను తమలో మరో మనిషిని దాస్తున్న మృగాల నుండీ అనుక్షణం కాపాడుతూ మరో అయ్య చేతికి అప్పగించేంత వరకూ నిత్యం మోస్తూనే ఉంది. ఎటునుండీ ఏ మృగం తమ ముక్కుపచ్చలారని బిడ్డపై పడతాడోనన్న భయం. అంతటి భయానక వాతావరణంలోకి జారిపోతున్నాం మనం. ఆడబిడ్డకు స్వేచ్ఛ, రక్షణా రెండూ లేవు. అది ఐదేళ్ళ పసికందైనా, అరవైయ్యేళ్ళ అమ్మమ్మైనా. కాలం మారుతున్నకొద్దీ పక్కవాడిని నమ్మలేని తనం నిండా ఆవరించేస్తుంది. కాశీభట్ల వేణుగోపాల్ గారు రచయితగా నాకు తెలీదు. ఆయన రచనలు చదివే సాహసం ఎప్పుడూ చెయ్యలేదు. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని నేను అర్థంచేసుకోగలనా అనే మీమాంసతో ఉన్న నాకు ఆయన రాసిన కథ ఒక్కటన్నా చదవాలని అనిపించి “బృందా” కథ మొదలు పెట్టాను. ఇప్పుడన్నా అంతటి సాహసం చేసినందుకు ఆనందిస్తున్నాను. ఈ కథలో ఎక్కడా రచయిత కనిపించడు, ఓ అమ్మ, ఆమె తన బిడ్డలను రక్షించుకోడానికి పడే తపనే కనిపిస్తుంది. రచయిత కథనంతా తనలోకి ఓ తల్లి హృదయాన్ని ఆవాహన చేసుకుని రాసాడా అనిపిస్తుంది. కథ శాంతం ఓ తల్లి మనసే కనిపిస్తుంది. రచయిత తన పదునైన మాటలతోనో, లేదా కథా వస్తువుతోనో...

ఈమధ్య నేను చదివిన కథ....

చిత్రం
చెదిరిపోయిన బంధాలు తిరిగి నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నీలో కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అవి నిన్ను విడిచి దూకంగా పోయినప్పుడు నువ్వు పడ్డ బాధనంతా పంటికింద నొక్కిపెట్టి ఒక్కసారిగా కట్టలు తెంచుకు వస్తున్న దుఖాఃన్నంతా కంటి కొనల్లో ఆపి నీ ముందున్న నీ పేగు బంధాన్ని గుండెలకు హత్తుకున్న నీలో దాగున్నది మానవత్వం అనాలా దైవత్వం అనాలా? "ఎడారి కోయిల" మధురాంతకం రాజారాం గారు రచించిన ఈ కథ చదువుతున్నప్పుడు నాలో దాచేసుకున్న గతాన్ని కాసేపు తాకింది. పల్లెటూరు, అక్కడి మనుషులు, వారి జీవితాలు, ప్రేమలు, ఆప్యాయతలు, పాడి పంటలు, ఉన్నతనానికీ లేనితనానికీ మధ్యగా ఉన్న గీతను చాలా దగ్గరగా చూపించారు. పేగుతెంచుకుని పుట్టిన బిడ్డ ఆ బంధాన్ని కాదని దూరంగా పోతే ఆ తల్లితండ్రులు సమాజంతో కలిసి మనడానికో, లేదా వాడి తరవాత పుట్టినవాళ్ళను బ్రతికించుకోవడంలోనో నిన్ను కాసేపు మరిచిపోవచ్చు. నువ్వు రావని జీవితంతో రాజీ పడిపోవచ్చు కానీ నువ్వు పుట్టినప్పుడు ఆ తల్లి పడ్డ పురిటినొప్పులు ఆమె ఊపిరి ఉన్నంతవరకూ మరవదు. కొడుకు రాకపోయినా తన మూలాలు వెెతుక్కుంటూ వచ్చిన మనవడిని చూసి "సుబ్బారాయుడి కళ్ళు పెద్దవయ్య...

“దివాణంలో దొంగలు పడ్డారు”

చిత్రం
ఎప్పటిలానే ఓ మామూలు సాయంత్రం వేళ కాకినాడ టూ కోటనందూరు బస్సు దిగి మట్టిరోడ్డు గుండా  చేతిలో బట్టల సంచితో దివాణం వైపు నడుచుకొస్తుంది పార్వతి. చాకలి రేవు, రాములవారి గుడి పక్కనున్న రచ్చబండ దాటాకా, మట్టి వంతెన మీద నడుస్తుంటే ఉప్పుటేరులో ఎండాకాలం అంతగా నీటిమట్టం లేనప్పుడు తను, సరోజా గుజ్జన గూళ్ళు ఆడుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. చీకటి పడటంతో ఆంజనేయస్వామి గుడి దగ్గర దీపాలు వెలుగుతున్నాయి. నిలువు చేతుల కుర్చీలో కాళ్ళు బార జాపుకుని కూర్చున్న ఎదురింటి రామం కళ్ళు మూసుకునే పెద్దగా విష్ణుసహస్రనామాలు చదువుతున్నాడు. మెట్లు ఎక్కుతున్న తనవైపు “ఈ వేళప్పుడు వచ్చావేమిటీ” అన్న ప్రశ్నను ముఖం మీద ముద్రగా వేసుకుని లోపలికెళుతున్న ఆమె వైపే కళ్ళు పెద్దవి చేసి చూస్తూండిపోయాడు. తన ఇంటికి ఎదురుగా ఉండే ఆ దివాణంలో జరిగే సంగతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కొన్నేళ్ళుగా రామానికి అలవాటుగా మారిపోయింది. తన రెండు కళ్ళకు కూతురు విశాలి కళ్ళు జోడించి “ఎవరా వచ్చేది” అంటూ నిత్యం ఆరాల పరంపర సాగిస్తాడు. నడుం లాగినపుడు గొలుసుల ఉయ్యాలపై పడుకుంటూ, మామూలు సమయాల్లో గుమ్మానికి పక్కగా వాల్చిన చేతుల వాలు కుర్చీలో కూర్చుని కాలాన్న...