నేను చేసిన మొదటి అనువాదం కినిగె పత్రికలో http://patrika.kinige.com/?p=3421 (ఆంటన్ చెఖోవ్ “డెత్ ఆఫ్ ఎ క్లర్క్” కు శ్రీశాంతి దుగ్గిరాల అనువాదం) ఒక మంచి సాయంత్రవేళ, అంతకన్నా మంచివాడైన ఆఫీసు గుమస్తా ఇవాన్ దిమిత్రిచ్ చెర్వియాకో నాటకశాల రెండవ వరసలో కూర్చుని ఒపెరాకళ్ళద్దాలలోంచి ప్రదర్శనలో లీనమైపోయి చూస్తున్నాడు. కానీ ఉన్నట్టుండి… ఈ “కానీ ఉన్నట్టుండి” అనే మాట కథల్లో తరచుగా వస్తుంది. రచయితలు చెప్పేది ముమ్మాటికి నిజం. మనిషి జీవితంలో ఉన్నట్టుండి జరిగే సంఘటనలు ఎక్కువే. కానీ ఉన్నట్టుండి అతని ముఖం ముడుచుకుంది, అతని కళ్ళు చక్రాల్లా గుండ్రంగా తిరిగాయి, అతని ఊపిరి నిలిచిపోయింది. చేతిలోని కళ్ళద్దాలను కిందకు దించి ముందుకు వంగుతూ “హాచ్…!” అంటూ తుమ్మాడు చర్వియాకో. తుమ్మటం అనేది ఏం నిషిద్ధం కాదు. ఎవరైనా ఎక్కడైనా తుమ్మచ్చు. రైతులు తుమ్ముతారు. కొన్నిసార్లు పోలీసు అధికారులూ తుమ్ముతారు, అంతెందుకు కౌన్సిలర్లు కూడా తుమ్ముతారు. మనుషులందరూ తుమ్ముతారు. చర్వియాకో ఈ పరిణామానికి ఏమీ ఇబ్బంది పడలేదు. చేతిరుమాలుతో తన ముక్కును మర్యాదపూర్వకంగా తుడుచుకున్నాడు. తర్వాత చుట్టూ చూసి తాను తుమ్మడం వల్ల ఎవ...