అలరాసపుట్టిళ్ళు).. అదే ఇప్పుడైతే.. సత్యవతి ఏం చేసేది..?
మనసుకు ఏది హాయి.. ఏది సోగయం, ఏది మైకం, ఏది మరపు రత్నాలలో లేని సొగసు, మణులలో లేని మెరుపు, ధనంలో, బంగారంలో నగల్లోలేని ఆనందం మంచి మనసులో, ఆప్యాయతలో ఉంది. స్వచ్ఛమైన మనసులు ఎందుకు అల్లుకుంటాయో తెలుసుకునే లక్షణం కొందరికే సొంతం. నిశ్చలమైన ప్రేమ, అరమరికలు లేని ప్రేమ విజయం సాధించాలంటే.. ఈ భారతావని మెదడు పురిటి బిడ్డంతే ఉంది మరి. కులం, మతం, ధనం, అంతస్తుల తూకాల మధ్య వేలాడుతుంది. పరువు ప్రతిష్టల అంచుల తేడాలో తూగలేక ఊగిసలాడుతూనే ఉంది. ఆడదాని మనసు ఎరిగి వివాహాలు జరిగితే ఇక చెప్పేదేముంది. ఆడదాని మనసు తెలుసుకోగలిగితే ఇక ఇంత ఉపోద్ఘాతం ఎందుకు. మనసులో మాయలేని మనిషిలేడు. ఉన్న కాస్త జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేసుకుని, ఆస్తులనీ, అంతస్తులనీ, బంగారాలని, పరువని, నరకానికి ద్వారాలు తెరిచేది మనమే.. ఆ మండువాకి సత్యవతే అందం. ఆమె లేని ఇల్లు పాడు బడింది. చెప్పుకొచ్చిన కథలో.. తొలి పేరాల్లోనే బీటలువారిన నేల, పగుళ్లు తేలిన వసారా, మండువా, గోడలు, ఎటు చూసినా ఈన్యం. ఎటు చూడు నిర్మానుష్యంతో, నిర్లక్ష్యంతో ఉన్న ఆ చావిట్లో ప్రాణాలు అరచేత పెట్టుకుని ఆఖరి ఘడియల్లో ఉన్నాడు సుబ్బారాయుడు. అతని కోసం పట్నవాసం పోయిన తమ్ముళ...