మళ్ళీ మనం ప్రేమను తెచ్చుకునేంత
మళ్ళీ మన ప్రేమను తెచ్చుకునేంత... ................................................. (శ్రీశాంతి) ఈ ముఖం చీకట్లో నీడలు పడి గాయపడింది.. ప్రాణానికి ప్రేమగాయం సెగ తగులుతుంది. చాలా సమీపంగా వచ్చేసిన నీకు తెలియంది కాదు. నా హృదయాన్ని పట్టి పీడిస్తున్న ఆలోచనల వెంట నిశ్చలమైన హృదయం కోసం పడే ఆరాటం.. ఎవరికీ తెలీకుండా నిన్ను దాచుకోవాలని లేదు. నీకు చాలా సమీపంగా వచ్చాను. గాయాలను మాన్పే శక్తి నీ ప్రేమకుందని నమ్మి నువ్వు నా దుఃఖంగా మారేంత వరకూ అదే నమ్మకం మనసు వీగిపోయేంత వరకూ అదే నమ్మకం రొదల వెంట పరుగులు పెట్టేంత వరకూ చేతి నుంచి మృత్యువు జీవాన్ని లాక్కున్నేంత వరకూ అదే అదే నమ్మకం.. నీకెదురుతిరిగి పోట్లాడి మళ్ళీ మన ప్రేమను తెచ్చుకునేంత వరకూ నిన్ను నా సమస్తంగా మార్చుకునేంత పిచ్చి నమ్మకం..