పోస్ట్‌లు

అక్టోబర్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

స్వగతం...

చిత్రం
మబ్బు పట్టడం, వర్షం చినుకు నేలకు రాలినపుడు మట్టివాసనేయడం, గాలిలో ధూళి కణాలు ఎగిరి ముఖాన్ని తాకడం, నీటిలో చిట్టి చేపలు గంతులేయడం. కొబ్బరి ఆకులు గాలికి తలలూపడం, అమ్మ గట్టిగా అదిలించి పిలవడం, నాన్న గుండెల మీద ఆడుకోవడం, ముద్దొచ్చి బుగ్గగిల్లితే నా ఏడుపు నాకే కొత్తగా అనిపించడం అంతా నేను కొత్తగా ప్రపంచంలోకి వచ్చానని తెలిపిన సమయాలు. నా అనే ఎరుకను ఇచ్చిన సందర్భాలు... ఇదే నా ప్రపంచం అని.. ఇక నుంచి నేను ఇక్కడే మనాలని,, గత జన్మ వాసనలు మరిచిపోయి.. కొత్త జన్మలో ఇమిడిపోయిన సందర్భాలు అవి. అన్నీ కొత్తగా వింతగా దోచిన విషయాలివి. నాతో పాటు తోబుట్టువులు, స్నేహితులు, చుట్టాలు ఎందరో, నేను అని, నాకు అని తెలియని రోజుల్లో బాల్యంలోకి చొచ్చుకుని పోయినపుడు నాకు కనిపించే దృశ్యాలు ఎన్నెన్నో.. వాటికి తోడుగా నాకు మిగిలిన జ్ఞాపకాల దొంతరలో తిప్పే ప్రతి పేజీలో ఓకథ. (శ్రీ)     

నిరీక్షణ..

చిత్రం
పాటలన్నీ నిశ్శబ్దంలోకి ఇంకిపోయాయి.. సాయంత్రాలు నీ ఊహను బరువుగా మార్చేసాకా.. మళ్ళీ రాత్రికి తేలియాడే ఆలోచనలు, ఆ వెచ్చని కౌగిలి, ఆ మరిచిపోలేని మైమరపు, నన్ను లాక్కెళ్ళే ఆ గదిలోని అగరబత్తీల వాసన.. నేను నువ్వయిపోయే క్షణాలకు అప్పగించేసుకున్న రాత్రి రాపిడిలో.. ఇంకో రోజు కలగా కరిగిపోయింది. ఇదంతా నీకు అర్థంకాదులే.. ఒంటరిగా కూర్చుని చూడు.. ఆలోచించు