కొన్ని జీరపోయిన ఆలోచనలతో నేను...

కొన్నిసార్లు మనలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో మనం ఉంటాం. మనిషి ఆశ మోహం నాకు కావాలన్న కోరికతో ఈ లోకంలోకి అడుగుపెడతాడు చివరి వరకూ అదే అతన్ని నడిపిస్తుంది. నా లోకంలోకి నేనూ అలాగే అడుగుపెట్టాను. ఎప్పుడూ ఏదీ కావాలని బలంగా కోరుకున్నది లేదు. చాలా జీవితం గడిచిపోయాకా.., చాలా దూరంగా జరిగిపోయాకా.. పోగొట్టుకున్నది ఎప్పటికీ తిరిగిరాదని.. నేను ఎవరికీ అవసరం లేదని తేలిపోయాకా.. ఇప్పుడున్న నా బంధాలను కాపాడుకోవాలనే సృహ కలిగాకా.. నాలో శక్తి అంతా కరిగిపోయాకా...ఇదంతా నా చుట్టూ జరుగుతున్న నాటకంగా మాత్రమే నాకు కనిపించడం మొదలు పెట్టింది. ప్రతి చర్య వెనుక మరో అర్థం కనిపిస్తుంది. నేను ఇక్కడ గడుపుకుని కొద్దిరోజుల్లో వెళిపోవాలనే సృహ నాకు కలుగుతుంది. నేను ఆరాధించే చలాన్ని ఎందరో ఆరాధించారు. ఎందరో కావాలనుకున్నారు. ఎందరో అసహ్యించుకున్నారు. మరెందరో దూషించారు. అంతకన్నా ఎక్కువమంది ఆయన్ని ప్రేమించారు. ఈ ప్రేమ అనే భావం మాత్రమే ఇప్పుడు ఆయన లేకపోయినా ఆయన పేరు చుట్టూ వలయంలా ఆక్రమించుకుని ఉండిపోయింది. ఆ ప్రేమే ఆయన్ని గుర్తుంచుకుని తరిమేట్టు చేస్తుంది. నాకు అక్షర జ్ఞానం తెలిసాకా రాయడం చదవడం అబ్బాకా నాతో ఆ క్షణం నుంచి ఈ క్...