పోస్ట్‌లు

మార్చి, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

“చైతన్య సాధనమైన రేడియోని సినిమా పాటలతో నింపేస్తున్నాం.” – శారదా శ్రీనివాసన్

చిత్రం
నిన్నటి తరం రేడియో అభిమానులను తన స్వరంతో అలరించి, శ్రవ్య నాటకాల ద్వారా సాహిత్యంలో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన శారదా శ్రీనివాసన్ గారితో ముఖాముఖి. - శ్రీశాంతి దుగ్గిరాల 1. మీ తల్లితండ్రులు, తోబుట్టువులు, బాల్యం, గురించి? మాది చాలా పెద్ద కుటుంబం. ఐదుగురు అన్నదమ్ములూ, నలుగురు అక్కచెల్లెళ్ళం. మా నాన్నగారు ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్ లో పనిచేసారు. మాలో అన్నదమ్ములంతా పెద్దవాళ్ళు. మగపిల్లలు త్వరగా చేతికందిరావాలని వారిని చదివించడంలో ఎక్కువ శ్రద్ధ చూపించారు. నేను కూడా బాగా చిన్నతనంలో స్కూలుకి వెళ్ళాను కానీ తర్వాత మా నాన్నగారు ఇంటి దగ్గరే చదువు చెప్పించారు. నాన్నగారికి బదిలీలు ఎక్కువగా అయ్యేవి. దానివల్ల మా చదువులు సరిగా సాగేవి కాదు. ఊరు మారినప్పుడల్లా కొత్త ఇంటి తో పాటు ఓ డాక్టర్ని, సంగీతం మాస్టారుని కూడా చూసేవారు నాన్నగారు. ఇక ఆడపిల్లల చదువుల విషయం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు ఆయన. కానీ మేము తణుకు వచ్చే సరికి, అప్పటికి నాకు పదీపదకొండేళ్ళు ఉంటాయి, మా అమ్మ గొడవ పెట్టి అక్కడి బాలసరస్వతి స్త్రీ సమాజం అనే పాఠశాలలో చేర్పించింది. నన్ను మా చిన్న చెల్లినీ పంపారు. అక్కడ నా చదువు మరో మూడేళ్ళు...