వాకిలి పత్రికలో నాకథ బామ్మగుట్టు ప్రచురితమైంది.

వాకిలి నవంబర్ సంచికలో నాకథ బామ్మగుట్టు ప్రచురితమైంది. http://vaakili.com/patrika/?p=6681 మిట్టమధ్యాహ్నం సూరీడు నడినెత్తిన ఉండి తన ప్రతాపాన్ని చూపిస్తున్న వేళ స్కూలు వదలగానే రోడ్డు మీద పడ్డాను మాసిపోయిన యూనీఫాంతో, అవ్వాయి చెప్పులేసుకుని. ఓపక్క ఆకలి, మరోపక్క వేడెక్కిన రోడ్డుమీద నడక, ఎంత తొందరాగా ఇంటికి వెళ్ళి అన్నం తింటానా అనే తొందరలో ఉన్నాను. సరిగ్గా మా గుడి సందు దాటుతుంటే, ఎత్తరుగు మీద ఇంటి చూరు కిందగా, కాళ్ళు బారజాపుకుని చేతి కర్రతో కాకుల్ని తోలుతూ వడియాలకు కాపలాకాస్తూ కూచునుంది సిద్ధేర్వరి బామ్మ. ఆకలి వల్ల కళ్లానక ఇలావచ్చేసాను. “చచ్చానురా దేవుడా… ఉత్తపుణ్యాన బామ్మకు పలారమైపోతానే” పక్కదారిగుండా పోకుండా ఎందుకు గుడి దారిన వచ్చానురా అనుకున్నాను. నేను తనను చూడక మునుపే బామ్మ తన గుడ్ల గూబకళ్ళేసుకుని నన్ను చూసేసింది. “ఏమిటే సుబ్బి ఇలా వస్తున్నావ్, ప్రసాదం కోసమేనా… అంత తిండియావ ఏమిటే… చదువు సంధ్యా ఏవన్నా ఉందేమిటే, ఇంత మిట్టమధ్యాహ్నపు వేళ ఏమిటే నీకు ఈవీధిలో పని… ఓ పక్కతెల్లారకుండానే గుడి దగ్గర వాలిపోతావు. దీపాలవేళా గుడి దగ్గరే ఉంటావు. ఇప్పుడెందుకు వచ్చావే… వేళ...