* నీ వెనక మాటలు *
చిరునవ్వులు ఒలకబోయకు చిత్రాలు జరుగుతాయని గుబులు నాకు ప్రాణంలో ప్రాణమవకు ఎప్పుడో జారిపోతావని భయం నాకు నీరుగారిన ఉత్సాహానికి ఊపిరి నీవౌతుంటే లోపలెక్కడో దిగులు అందకుండా ఆవిరైపోతావని ప్రేమ నిండిన నీ నిజాయితీ చూపులతో నువ్వు పలికే ప్రతి మాటా తూర్పుకాంతిలో వెలిగే పచ్చిక మీది బొట్టులా అనిపిస్తుంది నాకు. చిప్పిల్లే ప్రతి చుక్కకీ తెలుసు మనం జంటని, మనది నూరేళ్ళ పంటని. ఏలెక్కలూలేని ఉదయం మనది గడియారంతో పనిలేని పయనం మనది.