పోస్ట్‌లు

జులై, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

నా మూడో కథ "వేపచెట్టు" కినిగె పత్రికలో

చిత్రం
ఇక్కడ చదవండి. ఆ ఇంట్లోకి మేం అద్దెకొచ్చి పదేళ్ళు పూర్తయ్యాయి. ఏడాదిలో ఓసారి ఆకస్మిక తనిఖీ చేసి వెళుతుంది మా ఇంటి ఓనరు ఆదిలక్ష్మిగారు. ఆ ఏట ఇంటి మరమ్మత్తులేమన్నా ఉంటే చేయించేసి వెళుతుంది. మనిషి చాలా మంచిది, జాలీ, ప్రేమా ఎక్కువే. కాస్త అమాయకురాలు కూడాను. ఎవరేం చెప్పినా ఇట్టే నమ్మేస్తుంది. నెలనెలా అద్దె మాత్రం రమణమూర్తి అని ఆదిలక్ష్మిగారి దూరపు బంధువు వసూలు చేస్తాడు. ఈ మనిషి పైకి కనిపించినంత మంచోడేంకాదు. ఆదిలక్ష్మిగారికి ఈ ఊళ్ళో ఆస్తులు చాలానే ఉన్నాయి. ఆమెకి అద్దె ఓ లెక్కకాదు. రమణమూర్తి అది అలుసుగా తీసుకుని సంవత్సరం వసూలు చేసిన అద్దెనంతా తన దగ్గరే ఉంచుకుని వడ్డీకి తిప్పుతాడు. ఆవిడొచ్చే సమయానికి జమవేస్తూ ఉంటాడు. పైకి మా అందరితో “ఈ చాకిరీ ఎవరు చేస్తారు. నాకా వయసైపోతుంది. ఆదిలక్ష్మిగారు రాగానే అన్నీ అప్పగించేస్తాను” అంటూ తెగ రాగాలు తీస్తాడు. ఈ పదేళ్ళమట్టీ మాకా మాటలు వినీ వినీ అలవాటైపోయాయి. మేమాఇంట్లో దిగేటప్పటికి ఓ మొక్క కూడా ఉండేది కాదు. నాకు మొక్కల్లేకపోతే ఊపిరాడనట్టు ఉంటుంది కాబట్టి వచ్చిన ఏడాదిలోనే గేటువారగా ఇరుపక్కలా ఓ పసుపుపువ్వుల చెట్టు, పారిజాతం, ఆపైన నూతివారగా అరటి...