బంధనాల స్వభావాన్ని చిత్రించే “స్వేచ్ఛ”

ఓల్గా గారి నవల "స్వేచ్ఛ" రివ్యూ కినిగె పత్రిక డిసెంబరు సంచికలో పడింది. దాని లింక్: http://patrika.kinige.com/?p=355&view-all=1 పిడిఎఫ్ లింక్: http://patrika.kinige.com/wp-content/uploads/2013/12/Review-of-Swetcha.pdf ఈ పుస్తకానికి రాసిన పరిచయంలో రచయిత ఓల్గా స్వేచ్ఛ గురించి ఇలా అంటారు: ఈ స్వేచ్ఛ ఎవరో ఒకరు ఇచ్చేది కాదు. ఎవరి దగ్గర నుండి సాధించుకునేది కాదు. మన అవసరాలను, మన ఉనికికి అత్యవసరమైన విషయాలను మనం గుర్తించడమే స్వేచ్ఛ. నిజానికి ఇది సాధించడమే చాలా కష్టం. మన నుండి మనకు స్వేచ్ఛ. మనకు పుట్టుక నుండీ అలవాటైన భావాల నుండీ అభిప్రాయాల నుండీ ఆచారాల నుండీ స్వేచ్ఛ. మనలో జీర్ణించుకు పోయిన నమ్మకాల నుండీ విడుదల. అరుణ ఎమ్మే ఆఖరి సంవత్సరం పరిక్షలు రాసింది. మధ్యతరగతి కుటుబంలో పుట్టి పెరిగిన ఆమె చిన్న నాటి నుండి అదుపాజ్ఞలతో పెరిగింది. వయసు రాగానే తండ్రీ, అన్నగారూ అరుణకు హద్దులు నిర్ణయించేవారు. దీనికి కొంత కారణం అరుణ మేనత్త కనకమ్మ, భర్త చిన్నవయసులోనే చనిపోవడంతో తమ్ముడి (అరుణ తండ్రి) ఇంటికి కొంత ఆస్తితో చేరింది. వయసులో జరగాల్సిన ముచ్చ...